బలహీన వర్గాలపై దండయాత్ర చేస్తున్నారు: హరీష్ రావు

బలహీన వర్గాలపై దండయాత్ర చేస్తున్నారు: హరీష్ రావు

TG: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. పేదలకు భూములు ఇవ్వకుండా వారి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. వారికి భూములు అమ్ముకునే హక్కులు ఇస్తామని చెప్పి.. బడుగు బలహీన వర్గాలపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. పరిగిలో దమనకాండ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.