‘పెండింగ్ పనులు త్వరగా ప్రారంభించాలి'

‘పెండింగ్ పనులు త్వరగా ప్రారంభించాలి'

HYD: షేక్పేట్ డివిజన్ MIM కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ మంగళవారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులు, కొనసాగుతున్న పనులపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో వేగం పెంచేలా చూడాలన్నారు. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.