విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే
MBNR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 4వ సైన్స్ క్యాంపును ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.