భార్యను పనిమనిషిలా చూడొద్దు: సుప్రీంకోర్టు

భార్యను పనిమనిషిలా చూడొద్దు: సుప్రీంకోర్టు

వైవాహిక వివాదాల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను పనిమనిషిలా చూడొద్దని భర్తకు సూచించింది. వంట, క్లీనింగ్ పనుల్లో భర్తలు పాలుపంచుకోవాలని పేర్కొంది. కాలానికి అనుగుణంగా పురుషులు ఆలోచనలు మార్చుకోవాలని తెలిపింది. ఇంటి పనుల్లో భాగస్వామ్యం ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని వెల్లడించింది.