'మధ్యాహన్న భోజనం రుచిగా రుచిగా ఉండాలి'
CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలను మండల పరిషత్ అధ్యక్షులు లక్ష్మీపతిరాజు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు.