గోపులాపూర్‌లో ఎడ్ల బండ్ల పోటీలు

JGL: బుగ్గారం మండలం గోపులాపూర్‌లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఎడ్ల బండ్ల పోటీలు, రథోత్సవం జరిగాయి. ఎస్సై శ్రీధర్ రెడ్డి, విలేజ్ పోలీస్ ఆఫీసర్ పులి రవిలు ఎడ్ల బండ్ల పోటీలను ప్రారంభించారు. కండ్లే మదన్, గాజుల సత్తయ్య, బీర్పూరి తిరుపతి, గైనీ రమేష్, మర్రిపెళ్లి రవీందర్ రెడ్డి, తుమ్మల రాజేష్, గైనీ శ్రీను, అంజి, గోవిందుల రమణ తదితరులున్నారు.