'అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం'
TPT: యర్రావారిపాలెం మండలం కోటకాడపల్లిలో ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. ముందుగా గ్రామస్తులు, యువత ఆయనకు స్వాగతం పలికారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాత సుఖీభవలో భాగంగా 292 మంది రైతులకు రూ.20.44 లక్షలు జమ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.