తగ్గుతున్న కుండల గిరాకీ

తగ్గుతున్న కుండల గిరాకీ

మేడ్చల్: బాలానగర్ రహదారి పక్కన కుండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే మట్టి కుండలకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఈసారి గత ఏడాదితో పోలిస్తే గిరాకీ గణనీయంగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి రోజుకు డజన్ల కొద్దీ కుండలు అమ్మేవాళ్లం. కానీ ఇప్పుడు గిరాకీ రావడం లేదని ఓ కుండల వ్యాపారి తెలిపారు.