అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్
VKB: తాండూరు పట్టణ ప్రజలు, వ్యాపారులు అందరు ఆస్తిపన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్ పరిధిలో పెద్ద మొత్తంలో ఆస్తిపన్నుల బకాయిలు ఉన్నాయని తెలిపారు. యజమానులు, వ్యాపారులు నేరుగా వారికి ఆస్తిపన్నులు చెల్లించవచ్చన్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చని అన్నారు.