చైనా మాంజా విక్రయిస్తే జైలు తప్పదు: ఎస్పీ శబరీష్

చైనా మాంజా విక్రయిస్తే జైలు తప్పదు: ఎస్పీ శబరీష్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ హెచ్చరించారు. సంక్రాంతి నేపథ్యంలో గాలిపటాల ఎగరవేత సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సోమవారం తెలిపారు. దీనిని విక్రయించినా లేదా వినియోగించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.