నక్సల్స్ రహిత దేశంగా భారత్ : అమిత్ షా
నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను మార్చినట్లు కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. కేంద్రంలో NDA ప్రభుత్వం వచ్చాక గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు. గత 12 ఏళ్లల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరిగినట్లు తెలిపారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పోరులో ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచారని తెలిపారు.