పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో 'అరైవ్-అలైవ్’ కార్యక్రమం

పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో 'అరైవ్-అలైవ్’ కార్యక్రమం

ASF: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని సిర్పూర్ (టి)ASI రాములు కోరారు. వెంకట్రావ్ పేట్‌‌లో శనివారం నిర్వహించిన 'అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు రోహిత్, శ్రీనివాస్, సంఘవి ఆటపాటలతో అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిబంధనలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.