చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమే: ట్రంప్

చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమే: ట్రంప్

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయితే, ఈ ధరల పెరుగుదల కేవలం స్వల్పకాలికమేనని.. ప్రపంచ భద్రత, శాంతి కోసం మనం చెల్లించే 'చిన్న మూల్యం' మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రుత్ సోషల్'లో పోస్ట్ చేశారు.