పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు మండలంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలోని కొత్తకోట పంచాయతీలో వాటర్ షెడ్లను, సచివాలయ భవనాన్ని, రైతు సేవా కేంద్రాన్ని, విలేజ్ హెల్త్ కేర్ సెంటర్, సిమెంటు రోడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తుందన్నారు.