తెనాలిలో వైద్య విద్యార్థికి ఆర్థిక సాయం
GNTR: తెనాలి శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ చదువుతున్న విద్యార్థి జీ.నరసింహస్వామికి రూ.11వేల ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ గుమ్మడి మొత్తాన్ని విద్యార్థికి అందించారు. సాయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత చదువులు చదివి, తెనాలికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు.