ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు వేగవంతం
TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి పొందింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.