'ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి'

'ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి'

NLG: ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటి పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలకు ఉద్దేశించి రుతుస్రావం, వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.