ట్రాక్టర్ కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
నంద్యాల మార్కెట్ యార్డులో గురువారం ట్రాక్టర్ కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ రివర్స్ వస్తున్న క్రమంలో ట్రాక్టర్ క్రింద పడి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.