'కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది'
Srcl: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల నగారా మోగిందని, దాదాపు 2 సంవత్సరాలు స్థానిక సంస్థలు లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుందని, అభివృద్ధి నీరుగారిపోయిందన్నారు.