శ్రీ వీరేశ్వర ఆలయానికి కంప్యూటర్‌లు బహూకరణ

శ్రీ వీరేశ్వర ఆలయానికి కంప్యూటర్‌లు బహూకరణ

కోనసీమ: ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామివారి ఆలయానికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు బహూకరించింది. వీటిని మేనేజర్ సాయి రామ్ ఆలయ ఛైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణలకు అందించారు. ఆలయానికి సంబంధించి వివిధ ఆన్ లైన్ సేవల నమోదు, పరిపాలనా విభాగంలో వీటిని ఉపయోగించనున్నారు.