'పారిశ్రామికవేతకు నివాళులర్పించిన అన్నా'
ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత నాదెళ్ల సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు భౌతికకాయన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను రాంబాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.