నేడు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

కృష్ణా: కృత్తివెన్నులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని ఏఎంసీ ఛైర్మన్ తులసీరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు చరవాణి, ఆధార్ నంబరు తప్పనిసరిగా అందులో రాసి ఇవ్వాలని ఆయన సూచించారు. ఇందులో మండల కూటమి నాయకులంతా పాల్గొనాలని కోరారు.