గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కొమరోలు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన అబ్బూరు బాల నరసింహులుగా పోలీసులు గుర్తించారు.