VIDEO: యనమలకుదురులో పోటెత్తిన భక్తులు
కృష్ణా: యనమలకుదురులో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రబల ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. వరుస క్రమంలో ప్రభలు నిలబెట్టి ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య భక్తి పాటలతో సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంది.