అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కృష్ణా: తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో రూ.74 లక్షలతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి నాయకులు పాల్గొన్నారు.