VIDEO: ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని చారిత్రాత్మక మటం గడ్డ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైంది. శివుడు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు కొలువై ఉన్న ఈ పురాతన ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం, బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.