టాక్సీ డ్రైవర్లకు సేఫ్టీ అవగాహన సమావేశం
TPT: స్థానిక టాక్సీ డ్రైవర్లతో సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా భక్తులను ఎక్కించుకొని ఘాట్ రోడ్లలో ఒకరిపై ఒకరు పోటీ పడి వాహనాలు నడపరాదని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే వాహనాలను ఇవ్వాలని టాక్సీ యజమానులకు సూచించారు.