పింఛన్ కోసం ఎమ్మెల్యేని కలిసిన దివ్యాంగుడు
PLD: గారపాడు గ్రామానికి చెందిన వేమవరపు రమేష్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదంలో కాలు కోల్పోయాడు. వికలాంగ పింఛన్ నిమిత్తం మంగళవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ని కలిసి తన సమస్యను విన్నవించారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ కలవాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు.