సత్యదేవుని ఆలయంలో చైత్ర పౌర్ణమి

సత్యదేవుని ఆలయంలో చైత్ర పౌర్ణమి

VSP: పూర్ణమార్కెట్ ఇసుకకొండపై ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి గురువారం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నారు. 3 బ్యాచ్‌లలో 120 వ్రతాలు నిర్వహించి దంపతులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం 1000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు.