14న ఓపెన్ చదరంగ పోటీలు

KNR: కేంద్రంలోని భగత్నగర్ విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈనెల 14న ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్లు కోచ్లు అంతగిరి రాజేందర్, అంతగిరి విశ్వనాథప్రసాద్ తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. హాజరయ్యేవారు శనివారంలోగా ఎంట్రీ ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.