GD నెల్లూరు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి.!

GD నెల్లూరు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి.!

CTR: GD నెల్లూరు మండలం ఎట్టేరి పరిధిలో శనివారం ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న బైకుని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కోటాగరం, ఈ. ఆర్ కండిగకు చెందిన అరుణాచలం, కుమార్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కోటాగరంకి చెందిన దేశయ్య అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.