జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

NRPT: జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ఈ రోజు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం క్రిస్టియన్‌పల్లి వద్ద పైప్ లైన్ మార్పు చేయాల్సి రావడంతో జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు.