గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ కమిటీ ఎన్నిక

గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ కమిటీ ఎన్నిక

BHNG: తుర్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మండల గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా దత్తాయపల్లి గ్రామ పంచాయితీలో కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎరుకల స్వామి గౌడ్‌ను, గౌరవ అధ్యక్షునిగా పల్లెపాటి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.