విధులకు గైర్హాజ‌రైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

విధులకు గైర్హాజ‌రైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

BHNG: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. జే. అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామ‌న్న‌పేటలోని ప్రభుత్వ ఆస్ప‌త్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ల‌ను పరిశీలించి అనుమతులు లేకుండా గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.