VIDEO: చీపురు పట్టిన జిల్లా వైద్యాధికారిణి
SKLM: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని జిల్లా వైద్య అధికారిని డాక్టర్ అనిత అన్నారు. శనివారం ఆమదాలవలస మండలం అక్కుల పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను సిబ్బందితో పాటు చీపురు పట్టి పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మీనా కుమారి , వసంత పాల్గొన్నారు.