ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై

ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై

KMM: ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నేలకొండపల్లి ఎస్సై సంతోష్ హెచ్చరించారు. ఆయా పార్టీల కార్యక్రమాలు, పార్టీల గురించి, వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడుగా వీడియో, మెసేజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు లోబడే ప్రతి ఒక్కరు వ్యవహరించాలని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు.