పింఛన్ పంపిణీ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఆయన పట్టణంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేశారు. మహిళలకు రూ.4వేలు చొప్పున నగదు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతినెలా 1వ తేదీనే పింఛన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని తెలిపారు.