VIDEO: అక్రమ ఇసుక రవాణా.. 7 లారీలు సీజ్
PLD: పెదకూరపాడులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 7 లారీలను ఎస్సై గిరిబాబు సీజ్ చేశారు. ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో వీటిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, సీజ్ చేసిన లారీలను తహసీల్దార్ ద్వారా మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్సై వెల్లడించారు.