కుచినెర్ల గ్రామంలో అస్తవ్యస్తమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ

కుచినెర్ల గ్రామంలో అస్తవ్యస్తమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ

GDWL: ​కేటీ దొడ్డి మండలం, కుచినెర్ల గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మట్టితో నిర్మించిన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.