నూతన ఆటో స్టాండ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనిలో నూతన ఆటో స్టాండ్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.