రికార్డు ధరకు వారణాసి ఓటీటీ డీల్!
రాజమౌళి, మహేష్ కాంబోలో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ 'వారణాసి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో హైప్ పెంచాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల్లో కలిపి రూ.1000 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.