ఈనెల 23న మధిరలో కళాకారుల వన సమారాధన
KMM: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కళాకారుల కోసం ఈనెల 23న వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో మధిర మండలం ఆత్కూరులోని అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో ఈ కార్యక్రమం జరగనుంది. 2014 నుంచి ప్రతి ఏటా ఈ వనభోజనాలను నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల కళాకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ అధ్యక్షులు కోరారు.