'రోడ్డు మార్గాన్ని బాగు చేయండి'

'రోడ్డు మార్గాన్ని బాగు చేయండి'

ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలలో నీరు నిల్వ ఉండటం వలన రాత్రి సమయంలో ప్రయాణం ప్రమాదకరంగా ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మార్గానికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.