రాహుల్‌ ఆరోపణలపై ఈసీ దర్యాప్తు చేయాలి: మాజీ సీఈసీ

రాహుల్‌ ఆరోపణలపై ఈసీ దర్యాప్తు చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో ఈసీ తీరును మాజీ సీఈసీ వై ఖురేషీ తప్పుబట్టారు. రాహుల్ ఓటు చోరీ ఆరోపణలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు.. దర్యాప్తుకు ఆదేశించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షనేత ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ విధానాన్ని ఆయన వ్యతిరేకించారు.