రోడ్డుకు ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్ల తొలగింపు

ASF: సిర్పూర్(టీ) మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల, ఈడెన్ గార్డెన్ పాఠశాల, రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్లను పంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. చెట్లు పెరిగి వాహనదారులకు, విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గమనించిన పంచాయతీ సెక్రటరీ తిరుపతి తుమ్మ చెట్లను JCB ద్వారా తొలగించారు.