తర్లుపాడులో అరుదైన నందీశ్వరుడి విగ్రహం..!

తర్లుపాడులో అరుదైన నందీశ్వరుడి విగ్రహం..!

ప్రకాశం: తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో అరుదైన సహస్రలింగేశ్వరుడు, మానవుని ఆకారంలో కూర్చొని నమస్కరిస్తున్న నందీశ్వరుడి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడా లేని విధంగా శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు తర్లుపాడులో అరుదైన ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకే రాతిపై 1001 లింగాలను మలచడం విశేషం.