VIDEO: టెంపో టైర్ పేలి 14 మంది కూలీలకు గాయాలు

VIDEO: టెంపో టైర్ పేలి 14 మంది కూలీలకు గాయాలు

అన్నమయ్య: చిన్న మండలం బెస్తపల్లి వద్ద మంగళవారం టెంపో టైర్ పేలి 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి మండలం చెర్లోపల్లికి చెందిన 20 మంది కూలీలు కేశపురంలో కర్బుజా కాయల కోత ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.