VIDEO: సత్తెనపల్లిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

GNTR: సత్తెనపల్లి బస్టాండ్ ఎదురుగా శనివారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.