నేడు జిల్లాలో పర్యటించనున్న సీఎం
సత్యసాయి: నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. అలాగే, పార్టీ నాయకులతో సమావేశమై పలు విషయాలపై చర్చించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.