అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో 10 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ కుసరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.